Mark Zuckerberg Loses $6 Billion In Hours As Facebook Plunges || Oneindia Telugu

2021-10-05 1

Facebook CEO Mark Zuckerberg’s loses more than $7 billion in a few hours after the social media platform plunges. This was leads to knocking him down a notch on the list of the world’s richest people.
#MarkZuckerberg
#Facebook
#Instagram
#Whatsapp
#socialmedia

తిరుగులేని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌గా ఉంటూ వచ్చిన ఫేస్‌బుక్ జాతకం ఒక్కసారిగా తలకిందులైంది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల పాటు స్తంభించిపోయిందీ ప్లాట్‌ఫామ్. ఫేస్‌బుక్‌ కే చెందిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సైతం క్రాష్‌కు గురయ్యాయి. వాటిల్లో యాక్సెస్ పొందడానికి వినియోగదారులకు తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ తరువాత వాటిని పాక్షికంగా పునరుద్ధరించినట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.